E-PAPER

కేటీఆర్‌ సిబ్బంది విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కేటీఆర్‌ సిబ్బంది విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు..

సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని పోలీసులకు సూచన....

పోలీస్‌స్టేషన్‌లో తమపై దాడికి యత్నించారని పీఏ, పీఆర్వోల ఆరోపణ.. తదుపరి విచారణకు హాజరైనప్పుడు రక్షణ కల్పించాలని ఆదేశం

(శుభ తెలంగాణ,హైదరాబాద్‌ ప్రతినిధి: కే. నరేష్‌ యాదవ్‌)

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ కుంభా మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌ మాణిక్యల విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు సైఫాబాద్‌ పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్‌ 14న వారు పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు, అలాగే విచారణకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను భద్రంగా ఉంచాలని జస్టిస్‌ టి. మాధవి దేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్‌ 7న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి మహేందర్‌రెడ్డి, మహేశ్‌ మాణిక్యలను పోలీసులు సెప్టెంబర్‌ 14న విచారణకు పిలిచారు. అయితే విచారణ సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి తమపై దాడికి ప్రయత్నించారని వారు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు వ్యక్తులు ఆయుధాలతో వచ్చారని, ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తమను మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో వేచి ఉండేలా చేశారని, ఆ తర్వాత కొందరు వ్యక్తులు గుంపుగా విచారణ గదిలోకి ప్రవేశించి దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు స్వీకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే పిటిషనర్ల ఆరోపణలను ప్రభుత్వ తరఫు న్యాయవాది ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు ఓ కార్యక్రమానికి డీజే అనుమతి కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చినవారని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఇప్పటికే ఫిర్యాదు నమోదైందని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, పీఏ, పీఆర్వోలు తదుపరి విచారణకు హాజరయ్యే సమయంలో వారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని హోం సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, డీసీపీ, ఖైరతాబాద్‌ ఏసీపీలకు నోటీసులు జారీ చేసింది.

Share ePaper Clip

Preparing image...

సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని పోలీసులకు సూచన….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్