మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 19 (శుభ తెలంగాణ ప్రతినిధి: ఎన్. ప్రవీణ్ కుమార్)
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మహా గణపతికి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీ బాల భాస్కరరావుతో పాటు ఏడీజే తిరుపతి, 2వ ఏడీజే అమరావతి, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీదేవి, పోక్సో జడ్జి ఆశాలత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్, 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజు తదితర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కోర్టు సిబ్బంది, భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో న్యాయశాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.











