వాట్సాప్ కొత్త లీక్ అయిన నివేదిక ప్రకారం, యాప్ యొక్క ఇన్-యాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల ద్వారా అంతర్జాతీయ చెల్లింపులను ప్రారంభించే పనిలో ఉంది.
వాట్సాప్ చెల్లింపులు లేదా WhatsApp Pay మొదటిసారిగా భారతీయ వినియోగదారుల కోసం నవంబర్ 2020లో యాప్‌లో పేమెంట్ సేవలు పరిచయం చేసింది.
అప్పటికి ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లు స్థాపించబడినందున చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ యొక్క ప్రవేశం ఆలస్యంగా పరిగణించబడింది. ప్రస్తుతం,ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తన ఆర్థిక సేవల యొక్క వినియోగదారుల స్థావరాన్ని పెంచడానికి మూడు నెలల వరకు పరిమితితో అంతర్జాతీయ చెల్లింపులను తీసుకురావాలని చూస్తున్నట్లు టీజర్ విడుదలైంది.
ఈ ఫీచర్ గురించిన సమాచారాన్ని ప్రముఖ టిప్‌స్టర్ @AssembleDebug షేర్ చేసారు. అతను X (గతంలో Twitter అని పిలిచేవారు)లో ఒక పోస్ట్‌లో, “భారతీయ వినియోగదారుల కోసం UPI ద్వారా వాట్సాప్ లో అంతర్జాతీయ చెల్లింపులు రాబోతున్నాయి. ఇది ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో లేదు. కానీ నేను దాని గురించి గూగుల్‌లో ఏమీ కనుగొనలేకపోయాను కాబట్టి వాట్సాప్ దానిపై పని చేస్తూ ఉండవచ్చు అని చెప్పారు”
దీనికి సంబందించిన స్క్రీన్‌షాట్‌లను కూడా టిప్‌స్టర్ పంచుకున్నారు, కానీ ఏ బీటా వెర్షన్‌ను జోడించారో వివరాలు వెల్లడించలేదు.