E-PAPER

తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది.

వాహనాల రిజిస్ట్రేషన్ సాధారణంగా ఆయా రాష్ట్రాల పేర్లతోనే ప్రారంభమౌతుంటుంది. రాష్ట్రపేరులోని అక్షరాలే రిజిస్ట్రేషన్ సిరీస్‌గా ఉంటాయి. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేర్వేరు అక్షరాలతో టీఎస్‌గా నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఇప్పుడు మరోసారి వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చేందుకు సిద్ధమైంది. టీఎస్ కాకుండా టీజీ సిరీస్ ఉండాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..గెజిట్ నోటీఫికేషన్ సైతం జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీ ఉంటుంది. ఇప్పటి వరకూ వాడుకలో ఉన్న టీఎస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీతో మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మార్చాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ తక్షణమే అంటే మార్చ్ 12, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాడుకలో ఉన్నవి చెల్లుతాయి. కొత్తగా అంటే మార్చ్ 12 నుంచి మాత్రం కొత్త రిజిస్ట్రేషన్ టీజీ ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :