చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు.
ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు.
అందరికంటే ఎక్కువగా కీరన్ పోలార్డ్ 660 మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్ లు ఆడారు. కాగా.. అరుదైన ఫీట్ సాధించబోతున్న సునీల్ నరైన్.. టీ20 ఫార్మాట్ లో ఇప్పటివరకు ఆడిన 499 మ్యాచ్ ల్లో 536 వికెట్లు తీశాడు. 3736 పరుగులు సాధించాడు. కాగా.. నరైన 2011లో టీ20 ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సునీల్ నరైన్ రికార్డులు:
టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేశాడు.
టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (536) ఉన్నాడు.
కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్‌గా ఉన్నాడు.
పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా ఉన్నాడు..
టీ20ల్లో అత్యధిక టైటిల్స్లో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో ఉన్నాడు.