E-PAPER

X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్‌ మస్క్‌ ప్రకటన!!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అప్పటి నుంచి కీలక మార్పులు చేశారు. X ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక ఫీచర్లను తీసుకొచ్చారు.

దీంతోపాటు భవిష్యత్‌లోనూ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు.

ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తొలిరోజుల్లో ప్రీమియం యూజర్లకు మాత్రమే బ్లూటిక్‌ (వెరిఫైడ్‌ ఖాతా) గా గుర్తిస్తామని X సంస్థ వెల్లడించింది. అనంతరం ప్రీమియం యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు.

 

వారికి ఉచితంగా ప్రీమియం ఫీచర్లు : X లో 2500 కంటే ఎక్కువ వెరిఫైడ్‌ సబ్‌స్క్రైబర్లు ఫాలోయర్లుగా ఉన్న వారు ప్రీమియం ఫీచర్లను ఉచితంగానే (X Premium Features) పొందవచ్చని తెలిపారు. దాంతోపాటు 5000 వైరిఫైడ్‌ సబ్‌స్కైబర్లు ఫాలోయర్లుగా ఉంటే ప్రీమియం + ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటన చేశారు.

X ప్లాట్‌ఫాం ప్రీమియం మరియు ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రైబర్లు ఇతర ప్రయోజనాలతోపాటు ఇటీవల కొత్తగా లాంచ్‌ అయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) చాట్‌ బోట్‌ GrokAI యాక్సెస్‌ను పొందవచ్చు. గతంలో కేవలం ప్రీమియం+ సబ్‌స్కైబర్లకు మాత్రమే ఈ చాట్‌బోట్‌ అందుబాటులో ఉండేది. ఈ వారం చివర నుంచి ఈ చాట్‌బోట్‌ ప్రీమియం, ప్రీమియం+ యూజర్లకు అందుబాటులో ఉంటుందని మస్క్‌ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Grok AI ను గత సంవత్సరం నవంబర్‌లో ఆవిష్కరించారు. ఎటువంటి ప్రశ్నను అయినా ఈ చాట్‌బోట్ బదులివ్వగలదని సంబంధిత టీం వెల్లడించింది. దీంతోపాటు ఈ చాట్‌బోట్‌ రియల్‌ టైం సమాచారాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇతర AI చాట్‌బోట్‌లు రిజెక్ట్‌ చేసిన ప్రశ్నలను కూడా ఈ చాట్‌బోట్‌ సమాధానాలిస్తుందని పేర్కొంది.

** X ప్లాట్‌ఫాంలో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆడియో/ వీడియో కాల్‌ ఫీచర్‌ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు LinkedIn తరహాలో X లో జాబ్‌ సెర్చ్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్‌ను ప్లాట్‌ఫాంలో జతచేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను వెబ్‌ డెవలపర్‌ Nima Owji షేర్‌ చేశారు.

ఈ స్క్రీన్‌ షాట్‌ ఆధారంగా ఉద్యోగంలోని అనుభవం ఆధారంగా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని సంస్థల్లోని ఉద్యోగాల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. జాబ్‌ సెర్చ్‌లోని ఫిల్టర్‌ ఫీచర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మిలియన్ సంస్థలు ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది.

దీంతోపాటు ఎలాన్‌ మస్క్ కొన్ని రోజుల కిందట కీలక ప్రకటన చేశారు. త్వరలో X మనీ ట్రాన్సిమీటర్‌ లైసెన్స్‌ పొందుతుందని చెప్పారు. అంటే ఈ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీ చేసుకొనే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. X ప్లాట్‌ఫాంను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :