E-PAPER

పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తాగిస్తున్నారా? అయితే ఇది ఒకసారి తెలుసుకోండి.

: చిన్న పిల్లలకు పాలు తాగించడానికి చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తుంటారు. కొందరు వాటర్ ను కూడా తాగిస్తుంటారు. అయితే ఈ పద్ధతి మానుకోవాలి అంటున్నారు వైద్యులు.

వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి హానీ అంటున్నారు. సాధారణంగానే ప్లాస్టిక్ హానికరం అని తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు, ఆధారాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అయితే ఇది పిల్లలకు మరింత హాని చేస్తుందని తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోండి.

ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం మాత్రమే కాదు. వీటిని వేడి నీటితో శుభ్రం చేస్తారు కొందరు. కొన్ని సార్లు అదే బాటిల్ లో వేడి పాలను కూడా పోస్తారు. ఎందుకంటే వేడి నీటి వల్ల వైరస్, బ్యాక్టీరియా చనిపోతుందని వారి నమ్మకం. కానీ దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయట. ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేయడం వల్ల అందులోని మైక్రో ప్లాస్టిక్ లు పాలు, నీరు ద్వారా పిల్లల శరీరంలోకి వెళ్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ మైక్రో ప్లాస్టిక్ లు శిశువు కడుపు మెదడుకు హానీ చేస్తాయట.

ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేసినప్పుడు, లేదా వేడి నీటిని పోసినప్పుడు వాటి నుంచి బీపీఏ, Phthalates లు విడుదల అవుతాయట. దీని వల్ల పెరుగుతున్న పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఈ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరం అని చిన్నప్పటి నుంచి పుస్తకాలలో కూడా చదువుకుంటున్నాం. అలాంటివి పిల్లలకు మరింత హాని అంటున్నారు.

ప్లాస్టిక్ కు బదులు కొందరు సీసాలను కూడా వాడుతున్నారు. ఇందులో కూడా బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇక ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ మార్చుదాం అనుకున్నా కూడా పర్యావరణానికి తీరని ముప్పు చేసిన వారు అవుతారు. అందుకే స్టీల్, గ్లాస్ బాటిళ్లను ఉపయోగించండి అని సలహా ఇస్తున్నారు వైద్యులు. మరి మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :