E-PAPER

క్యాండిల్ ర్యాలీ కేసు కొట్టివేత…

Nagalla Praveen kumar Reporter
subhatelangana.in

క్యాండిల్ ర్యాలీ కేసు కొట్టివేత…

బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది ..జక్కుల లక్ష్మణ

(హైదరాబాద్,శుభ తెలంగాణ ప్రతినిధి / కే. నరేష్ కుమార్ ):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించినందుకు బీఆర్ఎస్ మాజీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి పై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.2024 జూన్ 1న గన్‌పార్క్ అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ తెలంగాణ ఫ్లేమ్ వరకు పోలీసుల ముందస్తు అనుమతితో ర్యాలీ నిర్వహించామని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపారు. అనుమతి షరతుల ఉల్లంఘన, అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడటం, ట్రాఫిక్‌కు అంతరాయం, డీజే–సౌండ్ సిస్టమ్ వినియోగం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.అయితే పోలీసుల అనుమతితో నిర్వహించిన ర్యాలీపై నమోదు చేసిన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసిందని జక్కుల లక్ష్మణ్ వెల్లడించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయపరంగా పోరాడుతుందని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది ..జక్కుల లక్ష్మణ

(హైదరాబాద్,శుభ తెలంగాణ ప్రతినిధి / కే. నరేష్ కుమార్ ):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించినందుకు బీఆర్ఎస్ మాజీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి పై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.2024 జూన్ 1న గన్‌పార్క్ అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ తెలంగాణ ఫ్లేమ్ వరకు పోలీసుల ముందస్తు అనుమతితో ర్యాలీ నిర్వహించామని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది *జక్కుల లక్ష్మణ్* తెలిపారు. అనుమతి షరతుల ఉల్లంఘన, అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడటం, ట్రాఫిక్‌కు అంతరాయం, డీజే–సౌండ్ సిస్టమ్ వినియోగం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.అయితే పోలీసుల అనుమతితో నిర్వహించిన ర్యాలీపై నమోదు చేసిన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసిందని జక్కుల లక్ష్మణ్ వెల్లడించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయపరంగా పోరాడుతుందని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్