కాప్రా, ఆగస్టు 14(శుభ తెలంగాణ ప్రతినిధి/ ఎన్ ప్రవీణ్ కుమార్ ): గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న AYUSH హౌస్ సర్జన్లు, PGల స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా JSPS హోమియోపతి PGలు, ఇంటర్న్స్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇతర వైద్య విభాగాలతో సమానంగా న్యాయమైన స్టైపెండ్ పెంపు కల్పించి, ఇందుకు సంబంధించిన జీవో ను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వర్ రావు, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












