E-PAPER

ఘట్కేసర్‌లో జిల్లా పరిషత్ విద్యార్థులకు 900 జతల షూస్ పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్: ముల్లి పావని జంగయ్య యాదవ్.

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ఘట్కేసర్‌లో జిల్లా పరిషత్ విద్యార్థులకు 900 జతల షూస్ పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్: ముల్లి పావని జంగయ్య యాదవ్.

ఘట్కేసర్, ఆగస్టు 14 (శుభ తెలంగాణ): ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు సుమారు 900 జతల షూస్ పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు షూస్ అందజేశారు.

ఈ సందర్భంగా పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి,మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం,సిరాజుద్దీన్,కరుముడి బాబురావు,యూత్ కాంగ్రెస్ నాయకులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్