E-PAPER

అధికారిక చర్యలపై వార్తలు ప్రచురించడం పరువు నష్టం కాదు: కేరళ హైకోర్టు…

Nagalla Praveen kumar Reporter
subhatelangana.in

అధికారిక చర్యలపై వార్తలు ప్రచురించడం పరువు నష్టం కాదు: కేరళ హైకోర్టు…

(శుభ తెలంగాణ రిపోర్టర్/ ప్రవీణ్ కుమార్ నాగళ్ళ )

కోచ్చి: అధికారిక చర్యలు, న్యాయపరమైన ప్రక్రియలకు సంబంధించిన వాస్తవాలను వార్తలుగా ప్రచురించడం మాత్రమే పరువు నష్టం కిందకు రాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. వార్తా కథనం వల్ల సంబంధిత వ్యక్తికి అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగిందనే కారణంతో జర్నలిస్టుపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేయలేమని పేర్కొంది.

ఒక మలయాళ మీడియా సంస్థ, సంపాదకులపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికారిక సమాచారాన్ని ప్రజలకు అందించడం, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని కించపరచడం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది.

వార్తా ప్రచురణ బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉన్నప్పుడు కేవలం ఎవరికైనా ఇబ్బంది కలిగిందనే కారణంతో దాన్ని నేరంగా పరిగణించలేమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్