E-PAPER

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి AICCTU

(అనంతరం జిల్లా/శుభ తెలంగాణ)రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రారంభించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (AICCTU) ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ పేర్కొన్నారు స్థానిక ఆత్మకూరు పట్టణం లేబర్ కార్యాలయం నందు అధికారి కి వినతిపత్రం అందజేశారు అనంతరం జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ మాట్లాడుతూ ఏఐసిసిటీయూ పోరాట ఫలితంగా 2019లో మాజీ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంక్షేమ బోర్డు నందు రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నందు నాలుగు లక్షల మంది సభ్యులుగా చేరడం జరిగింది కాని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికులకు ఏడు రకాల పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవారు అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి 18 వందలకోట్ల రూపాయలు నవరత్నాల సంక్షేమ పథకాల మళ్లించి కార్మికులకు తీరని అన్యాయం చేశారని వారన్నారు రాష్ట్రవ్యాప్తంగా 32,000 వేలమంది కార్మికులు సంక్షేమ బోర్డుకు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదని వారన్నారు ఇప్పుడు ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తిరిగి ప్రారంభించాలని వారు పేర్కొన్నారు 32,000 మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి పరిహారం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఉచిత ఇసుక పాలసీ ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :