E-PAPER

పెద్దోళ్ల మెప్పు కొద్ది.. పేదోళ్ళ పొట్ట కొట్టి…!!

పెద్దోళ్ల మెప్పు కొద్ది.. పేదోళ్ళ పొట్ట కొట్టి…!!

 

ప్రజా ఆగ్రహం ముటకట్టుకుంటున్న కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్…!!

 

పేదల పై జులూం.. పెద్దోళ్ళకు సాగిలం..!!

 

డ్రైనేజీ ఆక్రమణల తొలగింపు పేరుతో చిరు వ్యాపారుల ఉపాధికి గండి…!!

 

అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారు అంటూ ఆరోపణలు…!!

 

ఎమ్మెల్యే వసంత కు పిర్యాదు చేసే ఆలోచనలో బాధిత చిరు వ్యాపారులు…!!

 

కమిషనర్ నియతృత్వ దోరణి పై బగ్గు మంటున్న ప్రజానీకం…!!

 

డ్రైనేజీ పూడిక తీత లో కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి ఫలితంగా నిలిచిపోతున్న మురుగు నీరు…!!

 

డ్రైనేజీ ఆక్రమణల తొలగింపు కోసం లక్షలు వెచ్చించి ప్రత్యేక కాంట్రాక్టు…!!

 

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ అంటూ ఆరోపణలు…!!

 

(శుభ తెలంగాణ /ఎన్టీఆర్ జిల్లా, మైలవరం) మరో వారం వ్యవధిలో బదిలీ పై వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారో లేక అధికార పార్టీ నేతలు చెప్పింది చేస్తే మరో ఐదేళ్ల పాటు డొకా ఉండదు అనుకుంటున్నారో కానీ కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మాత్రం ప్రజా ఆగ్రహాన్ని మూటకట్టుకుంటున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపట్నం డ్రైనేజీ ఆక్రమణల పై కొరడా ఝులిపించిన మున్సిపల్ కమిషనర్ ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ లో భాగంగా పెద్దోళ్ల మెప్పు కోసం పెదోళ్ళ పొట్ట కొడుతున్నారు అనే అపవాదును మూటకట్టుకుంటున్నారు. డ్రైనేజీ ఆక్రమణల తొలగింపు పేరుతో అనేక మంది సామాన్యుల ఉపాధికి గండి కొట్టిన మున్సిపల్ అధికారులు పెద్దోళ్ల కు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ తొలగింపు లో ఏ మాత్రం కనికరం లేకుండా కూల్చివేతలు మొదలు పెట్టిన కమిషనర్ కొన్ని చోట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. కొందరికి వెసులుబాటు కల్పించిన అధికార యంత్రాంగం కొందరి గూడు సైతం కూలదోసి వికృత క్రీడకు తెర తీశారు. అయితే ఆక్రణమల తొగింపు ప్రక్రియ అభినందనీయం కానీ కొందరికి ఒకలా మరి కొందరికి మరోలా వ్యవహరించడమే వివాదాలకు కారణం అవుతుంది. డ్రైనేజీ లపై వ్యాపారాలు చేసుకునటున్న వారు కొండపల్లి మున్సిపాలిటీ కి అశీలు కట్టినవారే అధికంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగింపు కు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ తగ్గేదే లేదు అన్నట్లు వ్యవహరించారు. కానీ కొన్ని బడా సంస్థలు, కాంప్లెక్స్ లు, సినిమా ధియేటర్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తుంది. పేదోడి తీరని నష్టాన్ని మిగిల్చిన అధికారుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ బడా సంస్థలకు చెందిన ఆక్రమణలు ఇంచ్ కూడా కదిలించ లేకపోయారు అనే చెప్పాలి. పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్న పాలగాని, ఆల్ఫా హోటల్ వంటి సంస్థల ఆక్రమణలు తొలగించడం లో అధికారులు పూర్తిగా విఫలం అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అలానే వీటిపీఎస్ రోడ్డు రహదారికి మరో పక్క కూడా ఇంకా కలిచలేదు. జరుగుతున్న పరిణామాలు అంచనా వేసుకున్న ప్రజానీకం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కమిషనర్ ఇలాంటి చర్యలకు దిగుతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే సాబ్ ఇది న్యాయమా..!!

ఆక్రమణల తొలగింపు ప్రక్రియ లో కొండపల్లి మున్సిపాలిటీ అధికార యంత్రాంగం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి పై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వసంత కు పిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వసంత కు తెలియకుండానే స్థానిక నేతలు ఇలాంటి చర్యలను దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న నిరంకుశ చర్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్న పరిస్థితి నెలకొంది.

 15 రోజుల సమయం పడుతుంది..!!

బడా సంస్థలు చేసిన డ్రైనేజీ ఆక్రమణల తొలగింపు కు మరో 15 రోజులు సమయం పడుతుందని స్వయంగా మున్సిపల్ కమిషనర్ చెప్పడం విమర్శలకు తావిస్తుంది. పేదోళ్ల జీవనోపాధిని కూల్చడానికి సమయం ఇవ్వని కమీషనర్ పెద్ద వాళ్ళ సంస్థలకు ఎలా సమయం ఇస్తారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ నిందనలకు తిలోదకాలు ఇచ్చారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అందరకి సమాన న్యాయం చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంద

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :