E-PAPER

చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో..

రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్‌ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాలతో ఈ సినిమా మరింత లేట్ అవుతుంది. ఇక సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు.

 

ఇక తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ చేంసర్‌ ఫస్ట్ సింగిల్ జరగండి.. జరగండి.. సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సునిదీ చౌహన్, దలేరు మహేంది ఆలపించారు. అనంత్‌ శ్రీరామ్ రాసిన ఈ పాట ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాగా ఈ పాటకు ఏకంగా కోట్లలో ఖర్చు పెట్టారట మేకర్స్‌. కేవలం ఈ పాట చిత్రీకరణ కోసమే దాదాపు రూ.18 కోట్ల వరకు ఖర్చు పెట్టారట నిర్మాతలు. ఈ విషయాన్ని స్వయంగా ప్రొడ్యూసర్ ప్రకటించాడు. అయితే ఆయన చెప్పినంత గొప్పగా ఈ పాటైతే లేదంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ అభిమానులు కూడా ఈ పాట ఆయన రేంజ్ లో లేదంటూ వివరిస్తున్నారు. నాటునాటు పాటతో రామ్ చరణ్ క్రేజ్ వేరే లెవెల్‌కు వెళ్ళింది. అలా గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. శంకర్ కాంబోలో సినిమా అంటే ఆ మూవీ సాంగ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా చరణ్ రేంజ్ లో లేకపోవడం.. అలాగే థమన్ సంగీతం అందించడంతో ఆయనను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాటను కాపీ చేశారు.. సరే పోనీ పాట ఆకట్టుకునేలా వినసొంపుగా అన్న ఇచ్చారా అంటే అది లేదు.. అంటూ ఫైర్ అవుతున్నారు. అభిమానులు డీలా పడేలా పాట ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే పాటకు వచ్చిన రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది. 24 గంటల్లో తెలుగు, తమిళ, హిందీ భాషలో కలిపి కేవలం 5.3 న్యూస్ మాత్రమే పాటకు వచ్చాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :