E-PAPER

బి.సి సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ముత్తకాల సాయి యాదవ్ నియామకం.

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

బి.సి సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ముత్తకాల సాయి యాదవ్ నియామకం.

(శుభ తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి/ఎం. శ్రీ శ్రీనివాస్ రెడ్డి )బి.సి సమాజ హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య గారి ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ముత్తకాల సాయి యాదవ్‌ను నియమించారు. జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ సాయి యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎన్. మారేశ్ సాయి యాదవ్‌కు అభినందనలు తెలిపారు. బి.సి సమాజ అభివృద్ధి కోసం ఆయన సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు.అలాగే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ షామీర్‌పేట్ సాయి యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బి.సి యువత సమస్యల పరిష్కారం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన చురుకుగా పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకానికి గాను ఆర్. కృష్ణయ్య, గవ్వల భరత్ కుమార్, డా. ఎన్. మారేశ్ మరియు రాజేష్ షామీర్‌పేట్‌లకు ముత్తకాల సాయి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బి.సి సమాజ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్