(ఖైరతాబాద్/శుభ తెలంగాణ)ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పార్క్ వద్ద గోడను కూల్చివేశారనే ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నందిగిరి హిల్స్‌లో ఉన్న పార్క్ గోడను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన అనుచరులు ధ్వంసం చేశారని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ (EV&DM) ఇన్ఛార్జ్ వి పాపయ్య ఫిర్యాదు చేశారు.