E-PAPER

కుషాయిగూడ బస్‌స్టాప్ సమస్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలన…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కుషాయిగూడ బస్‌స్టాప్ సమస్యలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలన…

కుషాయిగూడ,14 ఆగస్టు (శుభ తెలంగాణ/ఎన్. ప్రవీణ్ కుమార్): కుషాయిగూడ బస్‌స్టాప్ పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లు, చలాన్ల పేరుతో స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసి సమస్యలను వివరించారు.

దీంతో ఎమ్మెల్యే స్వయంగా బస్‌స్టాప్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసోసియేషన్ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.బస్‌స్టాప్ సక్రమంగా కొనసాగడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులతో మాట్లాడుతామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక వ్యాపారులు, నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్