E-PAPER

వడివడిగా వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్… రూట్ మ్యాప్ పై రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

వడివడిగా వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్… రూట్ మ్యాప్ పై రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు

(శుభ తెలంగాణ/ హైదరాబాద్)దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన 'వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం ని ఆయన కార్యాలయంలో కలిసి,వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు.

వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్' ప్రణాళికల్ని వడివడిగా పూర్తిచేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

(శుభ తెలంగాణ/ హైదరాబాద్)దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం ని ఆయన కార్యాలయంలో కలిసి,వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు.

వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ ప్రణాళికల్ని వడివడిగా పూర్తిచేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్