E-PAPER

ఎంపీఆర్ దృష్టికి భగాయత్ లే అవుట్ సమస్యలు… మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరిన అసోసియేషన్…

ఎంపీఆర్ దృష్టికి భగాయత్ లే అవుట్ సమస్యలు…

మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరిన అసోసియేషన్…

సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి

(ఉప్పల్ /శుభ తెలంగాణ)ఉప్పల్ భగాయత్ లోని హెచ్ఎండిఏ లే అవుట్ సమస్యలు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి వద్దకు చేరాయి.ఏన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న అభివృద్ధి, కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్మించాల్సిన భవనాలు, ఏర్పాటు చేయాల్సిన కాంప్లెక్స్ లు, ఇతర వాటికి సంబంధించిన అనేక అంశాలను ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లే అవుట్ అసోసియేషన్ ప్రతినిధులు రజిత పరమేశ్వర్ రెడ్డి కలిసి పలు విషయాలను వివరించారు.

 

సీఎం దృష్టికి ఎనిమిదిన్నర ఎకరాల్లో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ ఏర్పాటు విషయం:రజితాపరమేశ్వర్ రెడ్డి.

 

భగాయత్ లోని హెచ్ఎండిఏ లే అవుట్ లో ఉన్న అన్ని రకాల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయనున్నట్లుగా ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

లే అవుట్ లోని ఎనిమిదిన్నర ఎకరాల్లో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా చేసేలా కృషి చేయనున్నట్లుగా అసోసియేషన్ ప్రతినిధులకు రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఈగ సంతోష్ ముదిరాజ్ ,నిధనకవి సుధాకర్ ,సోమ్ జంగయ్య ,గొరిగ రాజేష్ ,సోమ్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :