E-PAPER

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

డిసెంబర్ 9లోగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి.. లేదంటే 10న సీఎం నివాసం ముట్టడి.

తాడూరి గగన్ కుమార్ హెచ్చరిక..

(కాప్రా 27,నవంబర్ ,శుభ తెలంగాణ రిపోర్ట్ నాగళ్ల ప్రవీణ్)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మీడియా కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను డిసెంబర్ 9లోగా అమలు చేయాలని, కేకే కమిటీ సిఫార్సుల మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ (కరీంనగర్) సూచన మేరకు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.వి. కృష్ణారావు (ఖమ్మం) పిలుపుతో ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9, 2026లోగా  ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని, అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం కల్పించాలని పేర్కొన్నారు. కేవలం హామీలు, ప్రకటనలతో కాలయాపన చేయకుండా కేకే కమిటీ సిఫార్సులను అమలు చేస్తూ జీవోలు విడుదల చేయాలని స్పష్టం చేశారు.డిసెంబర్ 9లోగా డిమాండ్లు నెరవేర్చినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తామని, లేనిపక్షంలో డిసెంబర్ 10న సీఎం నివాసాన్ని ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసి, లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని, జైళ్లకు వెళ్లి, ఉద్యోగాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేసిన ఉద్యమకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమకారుల త్యాగాలు రాష్ట్ర సాధనకు ఉపయోగించుకున్న పాలకులు, వారి హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించడం తగదని విమర్శించారు.“మాటలు వద్దు.. జీవోలు కావాలి! హామీలు వద్దు.. అమలు కావాలి!” అనే నినాదంతో ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తాడూరి గగన్ కుమార్ స్పష్టం చేశారు.…

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్