E-PAPER

జన్మదినం రోజే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. బీఆర్ఎస్ తీవ్ర నిరసన.

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

జన్మదినం రోజే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. బీఆర్ఎస్ తీవ్ర నిరసన.

(ఉప్పల్, 27నవంబర్ ,శుభ తెలంగాణ రిపోర్టర్ /నాగళ్ళ ప్రవీణ్ కుమార్ )ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఉప్పల్ నల్లచెరువు వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఉప్పల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే క్రమంలో ఉప్పల్ చౌరస్తా వద్ద పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసు వ్యాన్‌లో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులను సైనికపురిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వదిలిపెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.తమ నాయకుడి జన్మదిన వేడుకలను నల్లచెరువు వద్ద నిర్వహించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్