E-PAPER

చార్విక్ నందన్ తొలి జన్మదినం సందర్భంగా 11 నెబ్యులైజర్ల విరాళం…*

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

చార్విక్ నందన్ తొలి జన్మదినం సందర్భంగా 11 నెబ్యులైజర్ల విరాళం…*

జన్మనిచ్చిన ఆసుపత్రికి సేవా కార్యక్రమం ద్వారా సహాయం..

హైదరాబాద్, అక్టోబర్ 7 (శుభ తెలంగాణ/కే.నరేష్ యాదవ్): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఉషిగళ్ల నవీన్–మనీషా దంపతులు తమ ప్రథమ పుత్రుడు ఉషిగళ్ల చార్విక్ నందన్ తొలి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. చార్విక్ నందన్ జన్మించిన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి 11 నెబ్యులైజర్ యంత్రాలను విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా నవీన్–మనీషా దంపతులు మాట్లాడుతూ, తమ కుమారుడు జన్మించిన ఆసుపత్రికి సేవా కార్యక్రమం రూపంలో సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు నెబ్యులైజర్ యంత్రాలు ఉపయోగపడతాయని, అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇవి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుమారుడి జన్మదిన వేడుకను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్