E-PAPER

వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌ హయాంలో పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం: కిషన్‌రెడ్డి….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌ హయాంలో పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం: కిషన్‌రెడ్డి….

దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠమన్న కేంద్ర మంత్రి

(శుభ తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: కే. నరేష్‌ యాదవ్‌)

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు గట్టి సందేశమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీలో చేరే వ్యవహారంపై కోర్టు తీర్పు కీలక పరిణామమని పేర్కొన్నారు. దానం నాగేందర్‌ 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఖైరతాబాద్‌ నుంచి గెలిచి, అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.
గత ప్రభుత్వాలపై కిషన్‌రెడ్డి విమర్శలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భాల్లో రాజీనామాలు చేయకుండానే పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దానం నాగేందర్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ..
దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు న్యాయపోరాటం చేశారని పేర్కొన్నారు. చివరకు హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది.
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మధ్య భూములు, అవినీతి అంశాల్లో పోటీ నెలకొందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా పరస్పరం రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నాయని అన్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌కు కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్