E-PAPER

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై సర్కార్‌ ఫోకస్‌.. రంగంలోకి రెవెన్యూ అధికారులు….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై సర్కార్‌ ఫోకస్‌.. రంగంలోకి రెవెన్యూ అధికారులు….

(శుభ తెలంగాణ, సిద్దిపేట జిల్లా ప్రతినిధి: ప్రభాకర్‌)

ఎర్రవల్లి భూములపై క్షేత్రస్థాయి పరిశీలన.. పాత రికార్డులు, సర్వే నంబర్లపై ఆరా...

ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ చుట్టూ ఉన్న భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఫామ్‌హౌస్‌ పరిధిలోని భూముల వివరాలను రికార్డులతో సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది.
పాత ఫైళ్లను తిరగేస్తున్న అధికారులు
మర్కూక్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పాత భూ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్‌, వరదరాజ్‌పూర్‌ ప్రాంతాలకు సంబంధించిన సర్వే నంబర్లు, ప్రభుత్వ భూములు, పట్టా భూముల వివరాలను సేకరిస్తున్నారు. భూముల గత పరిస్థితి, ప్రస్తుతం రికార్డుల్లో నమోదైన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భూముల లెక్క తేల్చే పనిలో రెవెన్యూ శాఖ
ఫామ్‌హౌస్‌ పరిధిలో మొత్తం ఎంత భూమి ఉంది? అందులో ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా? ఏ భూములకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా సంబంధిత సర్వే నంబర్లకు సంబంధించిన పాత, ప్రస్తుత రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీ ప్రకటనతో మొదలైన కదలిక
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించినట్లు సమాచారం. ప్రభుత్వ భూమి ఉన్నట్లు విచారణలో తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం సభలో ప్రకటించారు.
నివేదికపైనే ఇప్పుడు ఆసక్తి
ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్న భూ రికార్డులు, సర్వే వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా తుది నివేదిక రూపొందించనున్నారు. ఆ నివేదికలో ఏ అంశాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ చేపట్టిన ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.

Share ePaper Clip

Preparing image...

(శుభ తెలంగాణ, సిద్దిపేట జిల్లా ప్రతినిధి: ప్రభాకర్‌)

ఎర్రవల్లి భూములపై క్షేత్రస్థాయి పరిశీలన.. పాత రికార్డులు, సర్వే నంబర్లపై ఆరా…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్