E-PAPER

సెప్టెంబర్‌ 17 చరిత్రకు మతం రంగు పులమొద్దు.. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

సెప్టెంబర్‌ 17 చరిత్రకు మతం రంగు పులమొద్దు.. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత…

కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆరోపణ

(శుభ తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: కే. నరేష్‌ యాదవ్‌)

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో పోరాటం, ధైర్యం, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన రోజని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత అన్నారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. తెలంగాణ పోరాట చరిత్రకు మతం రంగు పులమొద్దని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌, బీజేపీలపై కవిత విమర్శలు
తెలంగాణ పోరాట చరిత్రను కాంగ్రెస్‌, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వక్రీకరిస్తున్నాయని కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటం వల్లే తెలంగాణ విలీనం జరిగిందన్న వాదనను ఆమె ప్రశ్నించారు. అప్పటి పరిస్థితుల్లో సంస్థానాల్లో పోరాటం చేయడం కాంగ్రెస్‌ విధానం కాదని మహాత్మాగాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించారు.
విలీన చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపణ
విలీనం అనంతరం పేదలకు ఇచ్చిన భూముల్లో పెద్ద మొత్తంలో భూములు తిరిగి జమీందారులు, భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయని కవిత ఆరోపించారు. తెలంగాణ చరిత్రను రాజకీయ లబ్ధి కోసం మార్చి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.
మతాలకతీతంగా సాగిన తెలంగాణ పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం హిందువులు–ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం సరికాదని కవిత పేర్కొన్నారు. అప్పటి పోరాటంలో వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, రవి నారాయణరెడ్డి, కాళోజీ, దాశరథి, షోయబుల్లా ఖాన్‌, మఖ్దూం మొహియుద్దీన్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్‌ బందగీ, మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవి తదితరుల పాత్రను ఆమె గుర్తుచేశారు.
ప్రజల హక్కుల కోసం పోరాటం
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని కవిత అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్